- Advertisement -
ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన విత్తన గణపతి కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది. పలువురు ప్రముఖులు పర్యావరణానికి హాని తలపెట్టని ఎకో ఫ్రెండ్లీ గణపతి విగ్రహాల తయారిపై అవగాహన కల్పిస్తున్నారు.
ఇందులో భాగంగా విత్తన గణపతి కార్యక్రమంపై సినీ,క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు ప్రచారం చేస్తుండగా తాజాగా డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ అంజన్‌కుమార్ యాదవ్‌లకు సీడ్ గణేశా ప్రతిమలను అందజేశారు టీ న్యూస్ సిబ్బంది.
ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్‌కు అభినందనలు తెలిపిన వారు….విత్తన గణపతి మంచి కాన్సెప్ట్ అన్నారు. కరోనా నేపథ్యంలో ఇంటివద్దే గణపతి పూజా కార్యక్రమాలు చేసుకోవాలని సూచించారు.
- Advertisement -