రేవంత్ వ్యాఖ్యలు నిజంకావు: డీజీపీ మహేందర్ రెడ్డి

100
dgp
- Advertisement -

తనపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి. తనను సెలవుపై ప్రభుత్వం బలవంతంగా పంపించిందన్న వార్తలు ఏమాత్రం సరికావన్నారు. రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన మహేందర్ రెడ్డి…మా ఇంట్లో జారిపడిన సంఘటనలో నాకు ఎడమ భుజం పైన బోన్ కు మూడు చోట్ల ఫ్రాక్చర్‌ జరిగిందని..డాక్టర్ల సూచన మేరకే సెలవు తీసుకున్నానని తెలిపారు.

ఫిబ్రవరి 18 వ తేదీ నుండి మార్చి 4 వతేదీ వరకు సెలవులో ఉన్నాని…గాయం తగ్గడంతో వైద్యుల సలహా మేరకు విధుల్లో జాయిన్ అవుతానని తెలిపారు. ఈ వాస్తవాలు తెలుసుకోకుండా తనను ప్రభుత్వం బలవంతంగా సెలవులో పంపించిందంటూ రేవంత్ రెడ్డి అవాస్తవాలు ప్రచారం చేయడం భావ్యం కాదన్నారు.

ఈ తప్పుడు ఆరోపణలు పోలీస్ శాఖ స్తైర్యాన్ని దెబ్బతీయడం తోపాటు, రాష్ట్ర ప్రజలకు నష్టం కలిగే ప్రమాదముంది. బాధ్యతాయుత సీనియర్ అల్ ఇండియా సర్వీసు అధికారులు, ఇతర అధికారులపై ఆరోపణలు చేసేటప్పుడు విచక్షణ, సంయయనం పాటించాలన్నారు.

- Advertisement -