పోలీసుల సేవలు సేవలు చిరస్మరణీయం అన్నారు తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి. రాష్ట్రంలో పోలీసుల కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ఇవాళ పోలీసు అమరవీరు సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరవీరుల స్దూపం వద్ద పుప్పగుచ్చం పెట్టి నివాళులర్పించారు. ఈసందర్భంగా డిజిపి మాట్లాడుతూ.. పోలీసులు తమ కర్తవ్యాన్ని గుర్తు చేసు కోవాలి. శక్తి వంచన లేకుండా పోలీసులు కృషి చేస్తున్నారు. వరంగల్ లో చిన్నారి హత్యచార ఘటనలో 21 రోజుల్లో నిందితుని శిక్ష కరారు అయింది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు భేష్ అన్నారు.
వీర మరణం పొందిన పోలీసులకు అన్ని రకాల పారితోషికాలు, అలివెన్స్ ,ఆరోగ్య భద్రత, నగదు రహిత చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. పోలీసులకు వీక్లి ఆఫ్ లు కూడా ఇస్తున్నాం. 18వేల పోలీస్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశాము..టెక్నాలజీ సహాయంతో నేరాలు నియంత్రిస్తున్నట్లు తెలిపారు. పోలీసులు సేవ దృక్పథంతో ప్రజల మనసు గెలవాలి.10లక్షల సీసీ కెమెరాలు హైదరా బాద్ లో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.బంజారాహిల్స్ లో 20 అంతస్తుల ఆధునాతన పోలీస్ కమాండ్ కంట్రోల్ ఈ సంవత్సరంలో ప్రారంభిస్తామని తెలిపారు.