తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి వెలుపల క్యూలైన్‌లో వేచి ఉన్నారు భక్తులు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తులు 70,217 మంది దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.84 కోట్లుగా ఉంది.
మరోవైపు కలిగిరి వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మండలాభిషేక కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. ఇవాళ ఉదయం 07.15 నుండి 11.00 గం.ల వరకు పుణ్యాహవచనం, ఆచార్య వరణము, వాస్తు హోమం, అకల్మష హోమం, సభ, పౌండరీ కాగ్ని ప్రతిష్ట, శాంతి హోమము, ధృవమూర్తికి అష్టోత్తర శతకలశాభిషేకం, అలంకారం, విశేష పూజ నితిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి వెలుపల క్యూలైన్‌లో వేచి ఉన్నారు భక్తులు. ర్వహించారు.
సాయంత్రం 05.30 గం.ల నుండి 09.00 గం.ల వరకు అంకురార్పణం, ప్రధాన శాంతి హోమం, కళాపకర్షణం చేపడతారు.జూలై 12వ తేదీ శనివారం ఉదయం 08.00 – 12.00 గం.ల వరకు పుణ్యాహం, ఉత్సవమూర్తికి చతుర్థశ కళశ స్నపనం, పంచగవ్య క్షీర, జలాధివాసములు, అధివాసాంగ హోమం చేపడుతారు. సాయంత్రం 05.30 – 08.30 గం.ల వరకు సర్వదైవత్యం, హోమం, మహాశాంతి హోమం, ధాన్యాధివాసం నిర్వహిస్తారు.
జూలై 13వ తేదీ ఆదివారం ఉదయం 06.00 – 07.30 గం.ల వరకు పుఅయాహం, పూర్ణాహుతి, ఉదయం 07.55 – 08.20 గం.ల వరకు ఉత్సవమూర్తికి కళా వాహనం, స్నపన తిరుమంజనం, అలంకారం, ఉదయం 11.00 – 12.00 గం.ల వరకు శాంతి కళ్యాణం, సాయంత్రం 05.00 – 06.30 గం.ల వరకు గరుడ సేవను నిర్వహించనున్నారు.
Also Read:ఫోర్త్ సిటీ టూ అమరావతి..గ్రీన్‌ఫీల్డ్ హైవే

