- Advertisement -
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు భక్తులు పోటెత్తారు.వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కొండపై ఉన్న అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. శిలాతోరణం వరకు భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచిఉన్నారు.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం పడుతుండగా నిన్న స్వామివారిని 75, 872 మంది భక్తులు దర్శించుకోగా 37,236 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. మంగళవారం రెండో రోజు స్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై మోహన కృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు ఊంజల్‌సేవ, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు హంస వాహనసేవ జరుగనుంది.
Also Read:వీటితో కొలెస్ట్రాల్ కు చెక్!
- Advertisement -