శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు

1
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి శోభ సంతరించుకుంది. శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కీసరగుట్టలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రామలింగేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు MLC పట్నం మహేందర్ రెడ్డి. కీసరగుట్టలో 2 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తుండగా 400 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది ఆర్టీసీ.

మహా శివరాత్రి సందర్భంగా సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు స్వయంభు లింగేశ్వర స్వామి దేవాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అలాగే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్ , ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.

వేయిస్తంభాల గుడిలో రుద్రేశ్వరస్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఏ శైవక్షేత్రం చూసినా సరే భక్తుల క్యూలైన్​లతో కనిపిస్తోంది.

Also Read:కీసరలో సంతోష్ కుమార్ ప్రత్యేక పూజలు

- Advertisement -