అంగ‌న్‌వాడీల‌ జీతాలేవి: దేవీ ప్ర‌సాద్

4
- Advertisement -

అంగ‌న్‌వాడీల‌కు జీతాలు ఒక‌టో తారీఖున‌ ఇస్తే.. వారు బుర‌ద జ‌ల్లుతున్నారా..? వీటిపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేత దేవీ ప్రసాద్. తెలంగాణ భ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడిన దేవీ ప్రసాద్..ఒకటో తారీఖునే జీతాలు వేస్తున్నాం అన్నారు, మీరు జీతాలు వేశాక కూడా ఆశ వర్కర్లు, అంగన్వాడిలు రోడ్ల పైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో ఉద్యోగుల ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారింద‌ని…అంగన్‌వాడీల‌కు ఏ ఒక్కరికీ కూడా ఇవాళ్టి వరకు జీతాలు అందలేదు. కిందిస్థాయి ఉద్యోగుల‌కు జీతాలు అందేలా ప‌ని చేయాల‌ని మంత్రి శ్రీధ‌ర్ బాబుకు సూచిస్తున్నాం అని చెప్పారు. ఆశా వర్కర్లకు, అంగన్‌వాడీలకు జీతాలు పెంచాం.. మీరు కూడా పెంచుతామ‌ని చెప్పారు..ఎప్పుడు పెంచుతారో చెప్పాలన్నారు.

అధికారి అపాయింట్‌మెంట్ ఇవ్వ‌ని ప‌రిస్థితి ఎందుకు వ‌స్తుంది. సీఎం రేవంత్ ప‌ర్మిష‌న్ తీసుకోవాల్నా..? ఒక అధికారే బీఆర్ఎస్ నాయకులకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వ‌చ్చిందో చెప్పాలన్నారు.

Also Read:తిరుమలకు పోటెత్తిన భక్తులు..

- Advertisement -