బాధితులకు అండగా తెలంగాణ ప్రభుత్వం: పువ్వాడ

515
puvvada ajay
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లోని దేవిపట్నం వద్ద గోదావరిలో లాంచీ ప్రమాదానికి గురైన వారికి అండగా తెలంగాణ ప్రభుత్వం ఉంటుందని చెప్పారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో పడవ ప్రమాదం లో మృతి చెందిన 8 మంది మృతదేహాలను పరిశీలించిన ఆయన క్షేమంగా బయటపడిన వారి ఆరోగ్య పై ఆరా తీశారు.

గల్లంతైన వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని, సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని బాధితులకు భరోసా ఇచ్చారు. బోటు ప్రమాదం పై సీఎం కేసీఆర్ కు తాజా పరిస్థితిని వివరించారు మంత్రి అజయ్ వివరించారు. మరోవైపు ప్రమాదం ఎప్పటికపుడు సమాచారం సేకరిస్తున్నారు సీఎం కేసీఆర్ .

మరోవైపు బాధితులకు అండగా నిలిచేందుకు శంషాబాద్ విమానాశ్రయం నుండి రాజమండ్రికి బయలుదేరారు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఆయనతో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కూడా ఉన్నారు.

- Advertisement -