బర్త్ డే స్పెషల్..డెవిల్‌లో సంయుక్త

8
- Advertisement -

వైవిధ్య‌మైన సినిమాల‌ను చేస్తూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న టాలీవుడ్ హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌. ఆయ‌న క‌థానాయ‌కుడిగా నటిస్తోన్న లేటెస్ట్ పీరియాడిక్ స్పై థ్రిల్ల‌ర్ ‘డెవిల్’. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా గ్లింప్స్‌లో హీరో పాత్ర తీరు తెన్నులు, డెవిల్ పాత్రలో తను ఒదిగిపోయిన విధానం, లుక్‌కి ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో సినిమాపై ఉన్న అంచ‌నాలు నెక్ట్స్ రేంజ్‌కు చేరుకున్నాయి.

తాజాగా ఇవాళ సంయుక్త మీనన్ బర్త్ డే సందర్భంగా సినిమాలో ఆమె ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు.పోస్ట‌ర్‌ను గమనిస్తే, కొబ్బ‌రికాయ‌, పువ్వులు అన్నింటినీ తీసుకుని గుడిలో పూజకు వెళుతున్న అమ్మాయిగా ప్లెజంట్‌ లుక్‌లో సంయుక్త ఆకట్టుకుంటోంది.

పాన్ ఇండియా లెవల్లో తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో డెవిల్ సినిమాను న‌వంబ‌ర్ 24న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఆక‌ట్టుకోబోతున్నారు. దేవాన్ష్ నామా స‌మ‌ర్ప‌కుడిగా, అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా దర్శక నిర్మాతగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

Also Read:Pawan:వీరమల్లు మళ్లీ అటకెక్కింది!

- Advertisement -