‘డెవిల్’ వార్…దర్శక-నిర్మాతల మధ్యలో!

26
- Advertisement -

వైవిధ్య‌మైన సినిమాల‌ను చేస్తూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న టాలీవుడ్ హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌. ఆయ‌న క‌థానాయ‌కుడిగా నటిస్తోన్న లేటెస్ట్ పీరియాడిక్ స్పై థ్రిల్ల‌ర్ ‘డెవిల్’. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్. టైటిల్ వింటుంటేనే క‌థానాయ‌కుడు సినిమాలో విల‌న్స్‌ను ఏ రేంజ్‌లో ఓ ఆటాడుకుంటాడ‌నే విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతుంది. యాక్ట‌ర్‌గా నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌లోని ఓ కొత్త కోణాన్ని ఎలివేట్ చేయ‌నుంద‌నే విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతుంది.

రీసెంట్‌గా విడుద‌లైన ‘డెవిల్’ టీజ‌ర్‌తో ఈ సినిమాపై అప్ప‌టికే ఉన్న అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగాయి. న‌వంబ‌ర్ 24న ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.ఇక ఈ సినిమాలో పాట 18న రిలీజ్ చేయనున్నారని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతా అనుకున్నట్లే జరుగుతుందనుకుంటున్న తరుణంలో దర్శక – నిర్మాతల మధ్య ఫైట్‌తో డెవిల్‌కు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి.

తాజాగా సినిమాలోని ‘మాయే చేసే’ అనే సాంగ్ కి సంబంధించిన ఒక అప్డేట్ ఇస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో దర్శకుడు నవీన్ పేరుని తీసేసి నిర్మాత అభిషేక్ నామా తన పేరుని వేసుకున్నాడు. ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అభిషేక్ నామా అని పోస్టర్ లో చూడవచ్చు. దీనికి కౌంటర్‌గా దర్శకుడు నవీన్ తన ట్విట్టర్‌లో.. వినాశకాలే విపరీత బుద్ధి అంటూ పేర్కొనగా ఇప్పుడు డెవిల్ మేకర్స్ మధ్య వార్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Also Read:పవన్ పెద్ద ప్లానే.. అందుకే టీడీపీతో పొత్తు?

- Advertisement -