టాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో ముందుకు దూసుకెళ్తున్నాడు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్. గతేడాది నేను శైలజ, నాన్నకు ప్రేమతో, సర్దార్ గబ్బర్ సింగ్, జనతా గ్యారేజ్ వంటి హిట్ సినిమాలతో వచ్చిన దేవి మ్యూజిక్ లవర్లను విశేషంగా ఆకట్టుకున్నాడు. ఇక చాలా కాలం గ్యాప్ తర్వాత మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150కి మ్యూజిక్ అందించే ఛాన్స్ కొట్టేసిన దేవి తనదైన ట్యూన్స్‌తో మెగాఫ్యాన్స్‌ని ఉర్రూతలూగించాడు.
తాజాగా స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో డీజే … దువ్వాడ జగన్నాథమ్ సినిమా చేస్తున్నాడు బన్నీ. గబ్బర్ సింగ్ ఫేం హరీష్ శంకర్ ఈ సినిమా కోసం తెగకష్టపడుతున్నాడు. ఈ సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా డీజేగా సరికొత్త పాత్రలో బన్నీ కనిపించనున్నాడు.
ఐదు క్రేజీ ప్రాజెక్టులకు పని చేస్తూ కూడా క్వాలిటీ చూపించడం దేవికే చెల్లింది. క్వాలిటీ విషయంలో రాజీ పడకుండానే యమ స్పీడుగా పని చేయడం దేవి స్పెషాలిటీ. తన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దువ్వాడ జగన్నాథం’ విషయంలోనూ దేవి అదే స్పీడు.. అదే క్వాలిటీ చూపిస్తున్నాడు.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు తీవ్రంగా కష్టపడుతుంది చిత్రయూనిట్. ఇందుకోసం అర్దరాత్రి వరకు షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఇక ఈ సినిమా కోసం దేవి విపరీతంగా కష్టపడుతున్నాడట. మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం హైదరాబాద్ వచ్చిన దేవి.. 20 గంటల్లో రెండు అదిరిపోయే పాటలు ఇచ్చేసి చెన్నై వెళ్లిపోయాడట. ఆ రెండు సూపర్ హిట్ పాటల్ని ఎప్పుడెప్పుడూ షూట్ చేద్దామా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు హరీష్ శంకర్ వెల్లడించాడు. దేవిశ్రీని సర్ జీ అని సంబోధిస్తూ అతడికి థ్యాంక్స్ చెప్పాడు. మహాశివరాత్రి సందర్భంగా ‘డీజే’ టీజర్ లాంచ్ చేయనున్నట్లు సమాచారం.