వర్మ పై దేవి కంప్లైంట్‌..

174
devi complaint on rgv on gst
- Advertisement -

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ చిత్రీకరించిన ‘గాడ్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌’ లఘుచిత్రం పై గత కొన్నిరోజులుగా తీవ్ర దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. మహిళలను కించపరిచే విధంగా వర్మ ఈ లఘు చిత్రాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేశాడంటూ మ‌హిళ సంఘాల నుంచి తీవ్ర‌వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతూనే ఉంది. అంతేకాకుండా వర్మపై ఫిర్యాదుల పర్వం కూడా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఆర్జీవీపై సీసీఎస్‌ పోలీసులకు సామాజిక కార్యకర్త, మహిళ సంఘం నాయకురాలు దేవి ఫిర్యాదు చేశారు.

మహిళలను కించపరిచే విధంగా రూపొందించిన గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ చిత్రం విడుదల కాకుండా చూడాలని కోరారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్మపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. రాంగోపాల్‌ వర్మ బూతు సినిమాలు ఇస్తూ సమజాన్ని చెడగొడుతున్నారని ఇటీవల ఓ టీవీ చర్చాక్రమంలో దేవి విమర్శించారు. మహిళలను అభ్యంతరకరంగా చూపిస్తూ అంగడి సరుకుగా మార్చేశారని తీవ్రస్థాయిలో మండిపడ్డ విషయం తెలిసిందే. దానికి వర్మ స్పందిస్తూ… దేవి చెత్తగా ఆలోచిస్తారని, సమాజంలోని అన్నివర్గాలకు తానే ప్రతినిధి అన్నట్టుగా వ్యవహరిస్తారని అన్నారు.

ఇంతకుముందు పలు సందర్భాల్లో టీవీ చర్చల్లో వీరిద్దరూ పరస్పర విభేదించుకున్నారు. పోర్న్‌స్టార్‌ మియా మల్కోవాతో తెరకెక్కించిన గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ చిత్రంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఎన్ని విమర్శలు వచ్చినా వర్మ వెనక్కు తగ్గలేదంటూ..గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న ఈ చిత్రాన్ని ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్టు ఆర్జీవీ ప్రకటించారు.

- Advertisement -