నీటి కుళాయి వద్ద మహిళలు పోట్లాడుకున్నట్లుగా ఫడణవీస్ గొడవ పడతారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌పై ఎన్‌సీపీ పార్టీ మహిళా ఎంపీ సుప్రియా సూలే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పుణెలో జరిగిన ఎన్‌సీపీ మహిళా కార్యకర్తల సదస్సులో సూలే పాల్గొన్నారు.
ఈ సంధర్బంగా సూలే మాట్లాడుతూ.. తాను ఎంతో మంది ముఖ్యమంత్రులను కలిశానని.. కాని ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదని అన్నారు. ఫడ్నవీస్‌కు కోపమస్తే ఎవరి మాట వినరని విమర్శించారు. ఆయనతో సమావేశమావ్వాల్సి వస్తే హెల్మెట్ పెట్టుకొని వెళ్తానని ఎద్దేశా చేశారు సుప్రియా. ఎందుకంటే ఆయనకు కోపం వస్తే ఏదైనా వస్తువును నాపైకి విసిరేసే అవకాశం ఉందని అన్నారు. కాగా తాను చేసిన ఈ వ్యాఖ్యల్ని ముఖ్యమంత్రికి తెలియజేయాలని సూలే విలేకర్లకు సూచించింది. ఎన్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శరద్ పవార్ కుమార్తె, స్వయంగా ఎంపీ అయిన సుప్రియ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది.