బలహీన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి..

197
- Advertisement -

బలహీన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ మేరకు అన్ని వర్గాలకు ప్రత్యేక స్కీంలు అమలు చేస్తున్నారు. యాదవుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు మెదక్ లో జరిగిన యాదవ శంఖారావానికి మంత్రి హరీష్రావు హాజరయ్యారు. అటు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం యాదవుల అభివృద్దికి 4 వేల కోట్లను కేటాయించిందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్.

Development programmes in Medak

ఇప్పటికే గంగపుత్రుల కోసం విస్తృతంగా చేపల పంపిణీ మొదలు పెట్టింది.. సర్కారు. అటు యాదవుల కోసం 75 శాతం సబ్సిడీతో గొర్రెలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. తమకు అండగా నిలిచిన సీఎం కేసీఆర్ కు బడుగులు రుణపడి ఉంటామంటున్నారు. ఈ మేరకు మెదక్ జిల్లా నర్సాపూర్లో యాదవులు శంఖారావ సభ నిర్వహించారు. కార్యక్రమానికి డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి, మంత్రులు హరీష్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, గొర్రెల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ రాజయ్య యాదవ్ హాజరయ్యారు.

Development programmes in Medak

యాదవుల అభివృద్ది కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నారన్నారు. అటు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం యాదవుల అభివృద్దికి 4 వేల కోట్లను కేటాయించిందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్. యాదవ, కురుమల జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపుతున్నారని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి పేర్కొన్నారు. యాదవులు, కురుమలు ఐక్యంగా ఉండాలని ఆమె కోరారు. 4 వేల కోట్ల రూపాయలతో 74 లక్షల మందికి గొర్లను పంపిణీ చేయనున్న సీఎం కేసీఆర్కు ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, చింతా ప్రభాకర్ ధన్యావాదాలు తెలిపారు.

- Advertisement -