రాష్ట్రాంలో టూరిజం శాఖను మరింత అభివృద్ది చేస్తామన్నారు టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. చైనా ఆర్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు చైనా ప్రతినిధులు హైదరాబాద్ లో పర్యటించారు. రాష్ట్రంలోని టూరిజం లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపారన్నారు. హైదరాబాద్ లో టూరిజం డెవలప్ మెంట్ పై చైనా ప్రతినిధుల బృందం సంతోషం వ్యక్తం చేశారన్నారు.
హైదరాబాదులో టూరిజం కల్చర్ పై ట్యాంక్ బండ్ చుట్టూ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారన్నారు. రెండు రోజుల పాటు పర్యటించి రుపొందించిన ప్రాజెక్టు రిపోర్టును ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామన్నారు. ఈసందర్భంగా తమను చైనా కు రమ్మని ఆహ్వానించారన్నారు.
ఇతర రాష్ట్రాల్లో ఎక్కడలేని విధంగా హైదరాబాదులో టూరిజం ప్రదేశాలు ఉన్నాయని చైనా ప్రతినిధుల బృందం పొగిడారని చెప్పారు. ఈ అంశాలన్నీ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ముఖ్యమంత్రి సలహాలు సూచనలు తీసుకుని రాష్ట్రంలో టూరిజం శాఖను మరింత అభివృద్ధి చేస్తామన్నారు.