కంటతడి పెట్టిన మాజీ ప్రధాని…

270
dewe gowda
- Advertisement -

ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది దేశవ్యాప్తంగా ఎలక్షన్‌ హీట్‌ పెరిగిపోయింది. ఇక ముఖ్యంగా కన్నడనాట రాజకీయాల తీరే వేరు.  ఒక కొడుకు కర్ణాటక ముఖ్యమంత్రి కాగా, మరో కొడుకు మంత్రి. తాజాగా మనవణ్ని కూడా ఆయన రాజకీయాల్లోకి పట్టుకొచ్చారు. మనవడిరి రాజకీయాలకు పరిచయం చేస్తూ కంటతడి పెట్టేశారు దేవేగౌడ.

బుధవారం హాసన్‌ పరిధిలో జరిగిన కార్యకర్తల సభలో కంటతడి పెట్టారు మాజీ ప్రధాని దేవేగౌడ. హాసన్‌ నుంచి ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ధారించుకున్నానని అధికారికంగా ప్రకటించారు. . నా మనవడి భవిష్యత్తును మీ చేతుల్లో పెడుతున్నానంటూ ఒక్కసారిగా ఏడ్చారు.

అదే వేదికపై ఉన్న మంత్రి రేవణ్ణ ,లోక్‌సభ అభ్యర్థి ప్రజ్వల్‌ రేవణ్ణ కూడా ఏడ్చారు. ఈ సందర్భంగా దేవేగౌడ మాట్లాడుతూ తనకు పుత్ర వాత్సల్యం ఉందని అందరూ అంటారని, పిల్లలకోసం పనిచేస్తారని ఆరోపిస్తారని, నేనెవరికైనా మోసం చేశానా..? అంటూ కంటతడిపెట్టారు. ప్రజలు తన వారసుణ్ని గెలిపించాలని అభ్యర్థించారు. కన్నీరు పెట్టుకున్న తాతను మనవడు ఓదార్చాడు.

- Advertisement -