Devara:యూఎస్‌లో వసూళ్లు అదుర్స్

4
- Advertisement -

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘దేవ‌ర‌’. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె నిర్మించిన ఈ మూవీ సెప్టెంబ‌ర్ 27న వ‌ర‌ల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ అయ్యింది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రంలో బాలీవుడ్ వెర్స‌టైల్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో న‌టించారు.

భారీ అంచ‌నాల‌తో విడుద‌లైన ‘దేవ‌ర‌’ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా మూడు రోజుల్లోనే రూ.304 కోట్లు గ్రాస్ క‌లెక్ష‌న్స్‌ను సాధించ‌టం విశేషం.

యూఎస్ మార్కెట్ లో 5.25 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసి నెక్స్ట్ మార్క్ గా 5.5 మిలియన్ కి దూసుకెళ్తుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించాడు. అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించిన ఈ చిత్రం కూడా రెండు భాగాలుగా రాబోతుంది.

ALso Read:TTD: బ్రహ్మోత్సవాల షెడ్యూల్ విడుదల..

- Advertisement -