దేవర ట్విట్టర్ రివ్యూ..!

10
- Advertisement -

మ్యాన్ ఆఫ్ మాసెస్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహించారు. జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో మ‌రో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టించారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె ఈ సినిమాను నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలతో పాటు అదనపు షోలు వేసుకునే అనుమతి ఇవ్వడంతో థియేటర్లలో దేవర హంగామా మొదలైంది. సినిమా చూసిన వాళ్లు బొమ్మ బ్లాక్ బాస్టర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇదేమీ నార్మల్ యాక్షన్ మూవీ కాదు.. విజువల్‌గా ఇదొక ఎపిక్ మూవీ అని చెబుతున్నారు. స్టోరీ, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, హంటింగ్ స్కోర్ ఇలా అన్నింట్లోనే దేవర ది బెస్ట్ అనిపిస్తుందన్నారు.

Also Read:పిడుగులపై ‘దామిని’ యాప్

తారక్ ఎంట్రీ.. ఆయుధ పూజ సాంగ్, ప్రీ ఇంట్రవెల్, ఇంట్రవెల్, ఇలా అన్నీ కూడా అదిరిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది.. ఇప్పటి వరకు అయితే సూపర్ హిట్ బొమ్మ.. సెకండాఫ్ కోసం వెయిటింగ్ అంటూ రిపోర్టులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అయితే అన్ని చోట్లా ఫస్ట్ హాఫ్ రిపోర్టులే కనిపిస్తున్నాయి. ఒంటి గంటల షోలకు మంచి రెస్పాన్స్ కనిపిస్తోంది.

చాలా స్లో నెరేషన్ అని, విజువల్స్ పూర్‌గా ఉన్నాయని, సెకండాఫ్ మీద కూడ అంత హోప్స్ ఏమీ లేవని మరికొంతమంది చెబుతున్నారు. ఎన్టీఆర్ ఆల్ రౌండర్ అని మరోసారి ఫ్రూవ్ చేసుకున్నాడు.. మాస్ కమ్ బ్యాక్.. ది బెస్ట్ టైటిల్ కార్డ్.. అంటూ ఇలా దేవర మీద ప్రశంసలు కుప్పిస్తున్నారు ఫ్యాన్స్. అయితే రియల్ రివ్యూ రావాలంటే మరికొద్దిగంటలు వేచిచూడాల్సిందే.

- Advertisement -