దేవర టికెట్ ధరల పెంపు

2
- Advertisement -

దేవర’ సినిమా టికెట్ల ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. మల్టీప్లెక్స్ లో ఒక్కో టికెట్ పై రూ. 135, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అప్పర్ క్లాస్ టికెట్ పై రూ.110, లోయర్ క్లాస్ టికెట్ పై రూ.60 పెంపుకు పర్మిషన్ ఇచ్చింది. రిలీజ్ రోజున అర్థరాత్రి 12 గంటల నుంచి 6 షోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 28వ తేదీ నుంచి 9 రోజుల పాటు రోజుకు 5 షోల ప్రదర్శనకు అనుమతిచ్చింది.

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ ఆర్‌.ర‌త్న‌వేలు, ఎడిట‌ర్ శ్రీక‌ర్ ప్ర‌సాద్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ సాబు శిరిల్ వంటి స్టార్ టెక్నీషియ‌న్స్ ఈ చిత్రానికి వ‌ర్క్ చేస్తున్నారు. జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో మ‌రో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టించారు. వరల్డ్ వైడ్ ఈ సినిమా సెప్టెంబర్ 27న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

Also Read:KTR: ఆద‌ర్శ నేత సీతారాం ఏచూరి

- Advertisement -