Jr NTR:దేవర వాయిదా..అసలు కారణమదే?

39
- Advertisement -

ఆర్ ఆర్ ఆర్ మూవీ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ దేవర. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ గా నిలిచింది. ఆ మూవీ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో దేవర పై మొదటి నుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఈ మూవీని ఏప్రెల్ 5న విడుదల చేయబోతున్నట్లు గతంలోనే చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం దేవర వాయిదా పడినట్లు తెలుస్తోంది. .

అయితే మొదటి నుంచి రిలీజ్ డేట్ విషయంలో కాన్ఫిడెంట్ గా ఉంటూ వచ్చిన దేవర టీం సడన్ గా మూవీని వాయిదా వేయడానికి కారణాలు ఏంటి అనే దానిపై రకరాల వార్తలు వినిపిస్తున్నాయి. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీ బెటర్ అవుట్ పుట్ కోసం బడ్జెట్ మరింత పెరిగే అవకాశం ఉందట. అందుకే చిత్రాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా మూవీకి మ్యూజిక్ అందిస్తున్న అనిరుద్ తన బిజీ షెడ్యూల్ కారణంగా ఇంకా ఎలాంటి ట్యూన్స్ ఇవ్వనట్లు సమాచారం అందుకే మూవీ వాయిదా పడడానికి ఇది కూడా ఒక కారణం అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

వీటన్నిటికి మించి డైరెక్టర్ కొరటాల శివను శ్రీమంతుడు స్టోరీ ఇష్యూ వెంటాడుతోంది. శ్రీమంతుడు స్టోరీ తనదేనని రైటర్ శరత్ చంద్ర ఇటీవల కోర్టులో కేసు వేయగా.. కోర్టు కూడా శరత్ వైపే తీర్పునిచ్చింది. దాంతో కొరటాల శివ ఇబ్బందుల్లో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటన్నిటి మూలంగా దేవర పోస్ట్ పోన్ వేయక తప్పలేదని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అయితే దేవర మూవీ వాయిదా పై చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. దీంతో దేవర రిలీజ్ పై ఇంకా కన్ఫ్యూజన్ నడుస్తూనే ఉంది. మరి మూవీ వాయిదా పడుతుందా ? లేదా ఎన్ని అడ్డంకులు ఎదురైనా అనుకున్న తేదికే రిలీజ్ అవుతుందా అనేది చూడాలి.

Also Read:ఖర్జూరాలు తింటే ఎన్ని ఉపయోగాలో!

- Advertisement -