దేవర..సరికొత్త ఆనౌన్స్ మెంట్!

5
- Advertisement -

మాన్‌ ఆఫ్‌ మాసెస్ ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’. ప్రపంచస్థాయిలో బజ్‌ క్రియేట్‌ చేస్తున్న సినిమా ఇది. బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండ‌గా బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీ ఖాన్ కీల‌క పాత్ర‌లో మెప్పించ‌నున్నారు. రెండు పార్టులుగా తెరకెక్కుతోంది దేవర. ఫస్ట్ పార్టు షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. తెలుగు, హిందీ, తమిళ్‌, కన్నడ, మలయాళంలో చిత్రాన్ని అత్యంత భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

దేవర: పార్ట్ 1 విడుదల తేదీని ముందుగా ఏప్రిల్ 5గా ప్రకటించారు. చిత్రంలో విలన్ రోల్ లో నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ గాయపడటంతో నిర్మాణం ఆలస్యం అయింది. అందుకే రిలీజ్ అక్టోబర్ 10కి వాయిదా వేశారు మేకర్స్.

గత కొన్ని రోజులుగా దేవర సెప్టెంబర్ 27కి ప్రీపోన్ అవుతుందని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్స్‌కు చెక్ పెట్టి దేవర రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా శ్రీకాంత్, షైన్ టామ్ చాకో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

Also Read:తుఫాను హెచ్చరిక… ఫస్ట్ లుక్

- Advertisement -