Devara:’దేవర’ వాయిదా తప్పదా?

31
- Advertisement -

యంట్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ” దేవర పార్ట్ 1 “. కోస్టల్ బ్యాక్ డ్రాప్ లో పక్కా మాస్ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవల విడుదల అయిన టీజర్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఎన్టీఆర్ గెటప్, విజువల్స్ మూవీ పై మరింత బజ్ ను క్రియేట్ చేశాయి. దాంతో సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాను ఏప్రిల్ 5 న విడుదల చేయబోతున్నట్లు మొదట్లోనే ప్రకటించారు. అయితే ప్రస్తుతం సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ మూవీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీఖాన్ ఇటీవల గాయపడి ఆసుపత్రి పాలు కావడంతో షూటింగ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. .

పైగా విఎఫ్ఎక్స్ వర్క్ కూడా పెండింగ్ ఉండడంతో మూవీని వాయిదా వేసేందుకే చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. అయితే ఈ మూవీ సమ్మర్ నుంచి పోస్ట్ పోన్ అయ్యి ఆగస్టు లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇక దేవర పోస్ట్ పోన్ అయ్యే సూచనలు కనిపిస్తుండడంతో ఏప్రిల్ 5 రావడానికి యంగ్ హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ‘ ఫ్యామిలీ స్టార్ ‘ ఏప్రెల్ 5న వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దేవర మూవీ వాయిదా పై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో పోస్ట్ పోన్ అవుతుందనే వార్తలు ఒట్టి రూమర్స్ గానే కొట్టి పారేస్తున్నారు తారక్ అభిమానులు. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా బాలీవుడ్ భామ జాహ్నవి కపూర్ నటిస్తుండగా, మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ స్వరాలు సమకూరుస్తున్నారు. మరి విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ చేస్తున్న దేవర మూవీ.. విడుదల తర్వాత ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Also Read:Rohit Sharma:వ్యక్తిగత రికార్డ్స్ వేస్ట్..!

- Advertisement -