Devara:’దేవర ‘లో కొరటాల మార్క్ మిస్?

31
- Advertisement -

టాలీవుడ్ లో ఉన్న అగ్ర దర్శకులలో కొరటాల శివ కూడా ఒకరు. ఆచార్య మినహా ఆయన తీసిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను నమోదు చేశాయి. ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్.. వీరందరికి కెరీర్ లో మర్చిపోలేని సినిమాలను అందించారు. ఆచార్య కంటే ముందు ఓటమి లేని డైరెక్టర్ గా రాజమౌళి తరువాతి స్థానంలో ఉండేవారు. కానీ ఆచార్య మూవీ తర్వాత కొరటాల ఇమేజ్ దారుణంగా పడిపోయింది. మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్ వంటి స్టార్ హీరోలు మూవీలో ఉన్నప్పటికి స్టోరీలో కంటెంట్ లేకపోవడంతో ఆచార్య బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇదిలా ఉంచితే ఇప్పటివరకు కొరటాల శివ చేసిన సినిమాలన్నీ కూడా సమాజనికి ఎంతో కొంత మెసేజ్ ఇచ్చేలాగే ఉంటూ వచ్చాయి. కానీ ప్రస్తుతం ఆయన డైరెక్షన్ చేస్తున్న దేవర మూవీలో పూర్తిగా రూట్ మార్చినట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్ తో చేస్తున్న ఈ దేవర మూవీ రెండు భాగాలుగా రాబోతుంది. మూవీలో ఎలాంటి మెసేజ్ లేకుండా పక్కా యాక్షన్ డ్రామాతో చిత్రాన్ని రూపొందిస్తున్నాట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి విడుదలైన గ్లిమ్స్ చూస్తే మూవీ యాక్షన్ కు పెద్ద పీట వేసినట్లు తెలుస్తోంది. కోస్టల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ మూవీ స్టోరీపై కొరటాల మొదటి నుంచి కూడా ఫుల్ కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. మరి ఆచార్యతో పోయిన తన ఇమేజ్ ను దేవర మూవీతో కొరటాల శివ తిరిగి పొందుతారో లేదో చూడాలి. దేవర మొదటి భాగం ఈ ఏడాది ఏప్రెల్ 5న విడుదల కానుంది. ఈ మూవీకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో కల్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఉన్న ఎన్టీఆర్ కు కొరటాల శివ ఎలాంటి విజయాన్ని అందిస్తారో చూడాలి.

Also Read:ఎంపీ స్థానాల్లో గెలుపుకు కృషిచేయాలి:సీఎం రేవంత్

- Advertisement -