Koratala Siva:రెండు పార్టులుగా దేవర

17
- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దేవర. ఇక సినిమా 2024 ఏప్రిల్ 5న విడుదలవుతుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే తాజాగా సినిమా నుండి ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చేశారు. కథ, సినిమా నిడివి దృష్ట్యా రెండు పార్టులుగా తీసుకురాబోతున్నామని వెల్లడించారు దర్శకుడు కొరటాల శివ.

ఇందుకు సంబంధించి ఓ వీడియోని సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. సినిమాలో ప్రతీ పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటుందని అందుకే ఒక్క పార్టుతో పాత్రలకు న్యాయం చేయలేమని భావించి రెండు పార్టులుగా తీసుకుస్తున్నామని చెప్పారు. ఇక ఈ సినిమాతో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ దక్షిణాదికి పరిచయం అవుతున్నారని చెప్పారు.ఫిషింగ్‌ హార్బర్‌ విలేజ్‌, పోర్ట్ మాఫియా బ్యాక్‌ డ్రాప్‌ చుట్టూ తిరిగే కథతో వస్తోన్న ఈ మూవీకి అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందిస్తున్నాడు.

లీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్‌ అలీఖాన్‌ భైర పాత్రలో (విలన్‌గా) నటిస్తుండగా ఎన్టీఆర్‌పై వచ్చే అండర్‌వాటర్‌ సీక్వెన్స్‌ సినిమాకే హైలెట్‌గా నిలువబోతుందని సమాచారం. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్‌ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.

Also Read:Harishrao:బీజేపీ లేచేది లేదు, కాంగ్రెస్ గెలిచేది లేదు

- Advertisement -