దేవర..ఫియర్ లిరికల్!

13
- Advertisement -

మాన్‌ ఆఫ్‌ మాసెస్‌ నటిస్తున్న భారీ బడ్జెట్‌ సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రపంచస్థాయిలో బజ్‌ క్రియేట్‌ చేస్తున్న సినిమా ఇది. బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీ ఖాన్‌ కీ రోల్‌ చేస్తున్నారు.రెండు పార్టులుగా తెరకెక్కుతోంది దేవర. ఫస్ట్ పార్టు షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోండగా సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది.

ఇప్పటికే సినిమా నుండి విడుదలైన టీజర్, సాంగ్‌కు మంచి రెస్పాన్స్ రాగా తాజాగా లిరికల్ వీడియో ను రిలీజ్ చేశారు. ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాయగా, అనిరుద్ రవి చందర్ పాడటం జరిగింది.

ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్,ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ బ్యానర్ లపై తెరకెక్కుతోంది.

Also Read:కల్కి..అఫీషియల్ రన్ టైం!

- Advertisement -