బుక్‌ మై షోలో దేవర హవా!

8
- Advertisement -

మ్యాన్ ఆఫ్ మాసెస్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం అనేక సంచ‌ల‌నాల‌ను క్రియేట్ చేస్తోంది. అభిమానులు స‌హా అంద‌రూ ఎంతో ఆతృత‌గా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ ఆర్‌.ర‌త్న‌వేలు, ఎడిట‌ర్ శ్రీక‌ర్ ప్ర‌సాద్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ సాబు శిరిల్ వంటి స్టార్ టెక్నీషియ‌న్స్ ఈ చిత్రానికి వ‌ర్క్ చేస్తున్నారు. జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో మ‌రో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టించారు.

దేవ‌ర రెండు భాగాలుగా రూపొందుతోంది. అందులో ‘దేవర పార్ట్ 1’లోని సాంగ్స్ అన్నీ చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. రీసెంట్‌గా ముంబైలో గ్రాండ్ లెవ‌ల్లో ట్రైల‌ర్‌ను రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ ట్రైల‌ర్‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. అన్నీ భాష‌ల్లో క‌లిపి మిలియ‌న్స్ వ్యూస్‌తో ట్రైల‌ర్ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. డిఫ‌రెంట్ ప్లానింగ్‌తో సాగుతోన్న ఈ మూవీ ఎక్స్‌పెక్టేష‌న్స్ రోజు రోజుకీ పెరుగుతున్నాయి.

తాజాగా బుక్ మై షోలో కూడా అదరగొడుతుంది. ఇన్ని రోజులు హైయెస్ట్ ఇంట్రెస్ట్స్ ఉన్న టాలీవుడ్ సినిమాగా పుష్ప 2 ఉంటే ఇప్పుడు దేవర దీనిని క్రాస్ చేసి ప్రేక్షకులు అత్యధికంగా ఎదురు చూస్తున్న సినిమాగా నిలిచింది. వరల్డ్ వైడ్ ఈ సినిమా సెప్టెంబర్ 27న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

Also Read:Revanth Reddy:ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు

- Advertisement -