దేవర-2..త్వరలోనే!

2
- Advertisement -

కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన చిత్రం దేవర. రెండు పార్టులుగా రానున్న ఈ చిత్రం ఫస్ట్ పార్టు భారీ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఇక సెకండ్ పార్టుపై మరింత దృష్టి సారించారు కొరటాల.

ప్రస్తుతం దేవర పార్ట్-2 స్క్రిప్ట్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. స్క్రీన్ ప్లే, కీలక సన్నివేశాలను ఆసక్తికరంగా మలిచేందుకు డైరెక్టర్ కొరటాల శివ, తన టీమ్‌ తో గత కొన్ని వారాలుగా వర్క్ చేస్తున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్, మురళీ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటించారు. మొత్తంగా దేవర షూటింగ్‌కు సంబంధించిన అప్‌డేట్ రావడంతో ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Also Read:మీలాగే అంతా బ్లాక్‌మెయిల్ దందా చేస్తారా?

- Advertisement -