‘దేవకీ నందన వాసుదేవ’100% మంచి సినిమా!

4
- Advertisement -

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. ఈ చిత్రానికి గుణ 369తో హిట్ కొట్టిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంత్ వర్మ కథ అందించారు. మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తున్నారు. నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. నవంబర్ 22 ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ముందుగా జయదేవ్ గారి గురించి ఒక మాట చెప్పాలి. ఆయనకి సినిమా గురించి తెలియదు అని చెప్పారు. నిజంగా ఆయనకి సినిమా గురించి తెలియదు కానీ వేల కుటుంబాలకి అన్నం పెట్టడం తెలుసు. ఆంధ్రప్రదేశ్ గురించి పార్లమెంట్ లో గొంతు వినిపించడం తెలుసు. ఈరోజు అనుభవిస్తున్న కొన్ని ఫలితాల్లో ప్రధాన పాత్ర జయదేవ్ గారిదే. ఈరోజు సొసైటీకి ఆయనకి తెలిసిందే కావాలి. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక ఐదేళ్ళు ఏకాగ్రత తో పని చేస్తే దేశం మొత్తం గర్వించదగ్గ ఇండస్ట్రీ లిస్ట్ అవ్వగల స్థాయిలో వున్న అశోక్, ఎంత కష్టపడ్డా మెప్పించడం చాలా కష్టమైనటువంటి సినీ ఫీల్డ్ ని ఎన్నుకొని ఈరోజు మీ ముందుకు వచ్చి ఆదరించమని అడుగుతున్నారు. నిజంగా ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా తనని ఆశీర్వదించాలి. ఇండస్ట్రీలో నిజాయితీగా పనిచేస్తే ఎవరికైనా స్థానం ఉంటుంది. నిజాయితీగా పనిచేస్తే ఈ పరిశ్రమ ఎవరికి అన్యాయం చేయదు. నిజాయితీగా పని చేస్తున్న అశోక్ గ్యారెంటీగా నిలబడతాడు. తప్పకుండా ఈ సినిమా పరిశ్రమ తనని నిలబడుతుంది. డైరెక్టర్ అర్జున్ జంధ్యాల కి అశోక్ కి సింక్ చాలా బాగుంది. మొదటి సినిమా మనల్ని పరిచయం చేస్తుంది. రెండో సినిమా నువ్వేంటో చెబుతుంది. ఈ సినిమా ఈ ఇద్దరికీ అగ్నిపరీక్షే. ఈ అగ్ని పరీక్షని ఎదుర్కొని గ్యారెంటీగా నిలబడతారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. చాలా మంచి సినిమా తీశారు. ఐదు నిమిషాలు సినిమా చూపిస్తే అందరూ క్లాప్స్ కొట్టారు. ఎందుకంటే దాని అవుట్ పుట్ అలా ఉంది. మ్యూజిక్ విజువల్స్ ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ ఈ సినిమా చూడాలని ఆసక్తిని రేకెత్తించాయి. నేను కూడా అశోక్ ఇంట్రడక్షన్ చూడాలని ఎదురు చూశాను. ఈ కాన్ఫిడెన్స్ తో వాళ్లు ముందుగానే ఐదు నిమిషాల పాటు ఈ సినిమా చూపించడం అనేది అభినందించదగ్గ విషయం. తప్పకుండా థియేటర్స్ కి వెళ్లి చూడాలని మంచి ఫీల్ వచ్చింది. థియేటర్ ఇదే ఫీల్ ఉండాలి. సినిమా మంచి హిట్ కావాలి. ఇలాంటి దర్శకులు హీరోలు బ్రహ్మాండంగా నిలబడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మనం చేసిన కథ మరొకరికి ఇవ్వాలంటే మంచి మనసు ఉండాలి. అలా మంచి మనసుతో కథని ఇచ్చిన ప్రశాంత్ వర్మ గారు ఎప్పుడూ బాగుండాలి. ఈ సినిమా 22వ తారీఖున విడుదలవుతుంది. చిన్న సినిమా పెద్ద సినిమా అని ఉండదు. మంచి సినిమానా కాదా అని ఉంటుంది. 100% మంచి సినిమా అని అనిపించింది. థియేటర్స్ లో కూడా అదే రిజల్ట్ వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్యూ’  అన్నారు.

Also read:సీఎం రేవంత్ రెడ్డి ఉన్న అరెస్ట్ చేయాల్సిందే: రాహుల్

హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. అశోక్ తన ఫస్ట్ సినిమా ‘హీరో’తో యాక్టర్ గా మంచి మార్కులు తెచ్చుకున్నాడు. సెకండ్ సినిమాకి ఇలా స్ట్రాంగ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సబ్జెక్ట్ చేయడం రిస్కీ. కాకపోతే తన కటౌట్ కమర్షియల్ హీరో కి కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఈ సినిమా ట్రైలర్ విజువల్స్ సాంగ్స్ చూసినప్పుడు తనకి పర్ఫెక్ట్ స్టొరీ అనిపించింది. తను కచ్చితంగా కమర్షియల్ హీరోగా సక్సెస్ అవుతాడు. అశోక్ చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. సినిమా అంటే తనకి చాలా పాషన్. అశోక్ చాలా మంచి హీరోగా ఇక్కడ సెటిల్ అవుతాడు. నిర్మాత బాలా గారి దగ్గర ఒక స్టార్ ప్రొడ్యూసర్ క్వాలిటీ ఉంది. మీడియా ముందుకు వచ్చినప్పుడు చాలా హానెస్ట్ గా మాట్లాడుతారు. ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. మానసకి చాలా లాంగ్ కెరియర్ ఉంటుందని నమ్ముతున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. వెల్కమ్ టు ది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. డైరెక్టర్ అర్జున్ గా హానెస్ట్ గా మాట్లాడారు. ఇదే హానెస్టీ మేకింగ్ లో ఉంటే ఆడియన్స్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. ట్రైలర్ చూస్తున్నప్పుడు బోయపాటి గారి రిఫరెన్స్ కనిపిస్తుంది. ఇంత మంచి స్క్రిప్ట్ ఇచ్చిన ప్రశాంత్ కి థాంక్యూ. నవంబర్ 22న అందరూ థియేటర్స్ లోనే ఈ సినిమా చూడండి. థాంక్యూ’ అన్నారు.

- Advertisement -