రివ్యూ: దేవదాస్

269
Devadas movie review
- Advertisement -

అక్కినేని నాగార్జున,నాచురల్ స్టార్ నాని హీరోలుగా తెరకెక్కిన చిత్రం దేవదాస్. వైజయంతీ మూవీస్ బ్యానర్లో అశ్వినీదత్ నిర్మాతగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చింది. నాగ్-నాని క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం…

కథ :

దేవ (నాగార్జున) ఓ మాఫియా డాన్‌. తన తండ్రిలాంటి దాదా(శరత్‌ కుమార్‌)ను ప్రత్యర్థులు చంపేయటంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోతాడు. తిరిగి దేవ బయటకు వస్తున్నాడన్న సమాచారంతో దాదాను చంపిన డేవిడ్ గ్యాంగ్ దేవను చంపాడానికి ట్రైచేస్తుంది. ఈ క్రమంలో దేవ పై అటాక్  జరుగగా డాక్టర్ దాస్(నాని)దేవకు ట్రిట్ మెంట్ చేస్తాడు. దాస్ మంచితనం చూసి అతనితో
ఫ్రెండ్ షిప్ చేస్తాడు. సీన్ కట్ చేస్తే తర్వాత కథ ఎలాంటి మలుపు తిరుగుతుంది..?దాదాను చంపిన వాళ్లని దేవ అంతమొందించాడా..?చివరికి కథ ఎలా సుఖాంతం అయిందనేదే దేవదాస్‌
సినిమా కథ.

ప్లస్ పాయింట్స్:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ కామెడీ,నాగార్జున-నాని నటన,నాగార్జున, సినిమాటోగ్రఫి. తన స్టైలీష్ లుక్‌తో మరోసారి మెస్మరైజ్ చేశాడు నాగ్. ఫుల్ ఎనర్జిటిక్ పర్ఫామెన్స్‌తో సినిమాను మరో మెట్టుకు తీసుకెళ్లాడు. ఇక సినిమాకు మరో ప్లస్ నాని. తనదైన నటనతో మెప్పించాడు. ముఖ్యంగా నాగ్-నాని మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయి. హీరోయిన్స్‌
ఆకాంక్ష సింగ్,రష్మిక తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఇతర పాత్రల్లో నరేష్,వెన్నెల కిశోర్,అవసరాల శ్రీనివాస్‌లు పర్వాలేదనిపించారు.

Image result for దేవదాస్

మైనస్ పాయింట్స్:

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ కొన్ని బోరింగ్ సీన్స్, ప్రీ క్లైమాక్స్‌.సినిమా అంతా దేవ, దాస్‌ల చుట్టూనే తిరుగడంతో హీరోయిన్ల పాత్రలకు పెద్దగా ఇంపార్టెన్స్‌ లేదు. ఎమోషనల్‌ డ్రామా స్టార్ట్‌ అయిన తరువాత కథనం బాగా స్లో అయ్యింది.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమాకు మంచిమార్కులే పడతాయి. చాలారోజుల తర్వాత స్టార్ హీరో సినిమాకు సంగీతమందించిన మణిశర్మ తన మార్క్‌ చూపించాడు. సినిమాకు మరో మేజర్‌ ప్లస్‌ పాయింట్‌ శ్యామ్‌ దత్‌ సినిమాటోగ్రఫి. శ్యామ్‌ పడిన కష్టం తెర మీద కనిపిస్తుంది. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

Image result for దేవదాస్

తీర్పు:

ఇంతవరకు స్టార్ హీరోలను డైరెక్ట్ చేసిన అనుభవం లేకపోయినా.. దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య దేవదాస్‌ తను అనుకున్న కథకు న్యాయం చేయడంలో సక్సెస్ సాధించాడు. నాని-నాగ్ నటన,కామెడీ సినిమాకు ప్లస్ పాయింట్ కాగా కొన్ని బోరింగ్ సీన్స్ మైనస్ పాయింట్స్. ఓవరాల్‌గా ఈ వీకెండ్ మంచి వినోదాన్నిచ్చే మూవీ దేవదాస్‌.

విడుదల తేదీ:27/09/2018
రేటింగ్: 2.75/5
నటీనటులు : నాగార్జున, నాని
సంగీతం : మణిశర్మ
నిర్మాత : అశ్వనీదత్‌
దర్శకత్వం : శ్రీరామ్‌ ఆదిత్య

- Advertisement -