ద జర్నీ ఆఫ్… దేవదాస్‌

265
#Devadas Making Video
- Advertisement -

కింగ్ నాగార్జున‌, నేచురల్ స్టార్ నాని న‌టించిన చిత్రం దేవ‌దాస్. పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. భలేమంచిరోజు, శమంతకమణి సినిమాలతో ప్రతిభను నిరూపించుకున్న శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు అభిమానుల ఆద‌ర‌ణ‌ని పొందింది.

కొద్ది రోజులుగా చిత్రానికి సంబంధించిన వీడియోలు విడుద‌ల చేస్తూ సినిమాపై మ‌రింత ఆస‌క్తి పెంచుతున్నారు మేక‌ర్స్‌. తాజ‌గా దేవదాస్ జర్నీ ఎలా సాగిందో వీడియో రిలీజ్ చేశారు. మహానటి విజయం తర్వాత వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఫస్ట్ వీక్‌లో 41 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసి రెండో వారంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్‌లో నాగ్…నానిపై ప్రశంసలు గుప్పించారు. ద‌ర్శ‌కుడు శ్రీ‌రామ్ ఆదిత్య‌కు మంచి భ‌విష్య‌త్తు ఉంది. ఇక నిర్మాత అశ్వినీద‌త్ నేను ఆఖ‌రి పోరాటం సినిమా చేసిన‌పుడు ఎంత ప్యాష‌న్ తో ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు.

- Advertisement -