- Advertisement -
బీఆర్ఎస్ పార్టీపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదన్నారు దేశపతి శ్రీనివాస్. Mlc జీవన్ రెడ్డి హరీష్ రావు మీద చేసిన కామెంట్స్ ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. పివి నరసింహ రావు ను కాంగ్రెస్ వాళ్లు తీవ్రంగా అవమానపరిచారని…పివి శతజయంతి తెలంగాణ ప్రభుత్వం సంవత్సరం పాటు నిర్వహించింది బీఆర్ఎస్ పార్టీ పివికీ ఎంతో గౌరవం ఇచ్చిందన్నారు.
భద్రాచలం 7 మండలాలు కోల్పోవడం,సీలేరు ప్రాజెక్టు పోవడం బీఆర్ఎస్ పార్టీ అని జీవన్ రెడ్డి అనడం హ్యాస్యాస్పదం అన్నారు. విభజన హామీలు నేరవేర్చాలని ఒక్కసారి కూడా కాంగ్రెస్ నాయకులు అడగలేదని…పోరాట సమయంలో కాంగ్రెస్ వాళ్లు లేరు అనుభవించే సమయానికి కాంగ్రెస్ వాళ్లు వచ్చారన్నారు.
Also Read:బిగ్ బాస్ 7 తెలుగు విజేతగా పల్లవి ప్రశాంత్
- Advertisement -