LPG:దేశంలో రెట్టింపైన ఎల్పీజీ కనెక్షన్లు…

38
- Advertisement -

దేశంలో గృహ వినియోగ గ్యాస్‌ వినియోగదారుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. దేశవ్యాప్తంగా గడిచిన 9యేళ్లలో కొత్తగా 17కోట్ల వినియోగదారులు ఎల్పీజీ కనెక్షన్లు తీసుకున్నట్టు కేంద్ర గణాంకాలు గురువారం ఒక మీడియా సమావేశంలో వెల్లడించింది. 2014 ఏప్రిల్‌లో 14.52కోట్లుగా ఉన్న గ్యాస్ వినియోగదారుల సంఖ్య 2023 నాటికి 31.36కోట్లకు చేరింది.

ప్రతి పేదవారికి గ్యాస్ సిలిండర్ ఉండాలనే ఉద్దేశ్యంతో 2016మే1 ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకంను ప్రవేశపెట్టారు. నాటి నుంచి గ్యాస్ వినియోగం పెరిగింది. మొదట్లో 5కోట్ల మంది మహిళలకు ఎల్పీజీ కనెక్షన్లు అందించటమే లక్ష్యంగా పెట్టుకుంది. అయితే దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లుతూ 8కోట్లకు చేరింది. అదే విధంగా 2021 ఆగస్టు 10న ఉజ్వల్2.0ని కూడా కేంద్రం ప్రారంభించింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ఇందుకు దోహదం చేసింది. గతంతో పోలిస్తే ఎల్పీజీ సిలిండర్ల లభ్యత కూడా పెరిగింది. ఒకప్పుడు సిలిండర్ రావడానికి సగటున 7-10 రోజులు పట్టేది. కానీ ఇప్పుడు చాలా చోట్ల 24గంటలోనే వంట గ్యాస్ చేరుతుంది.

Also Read: JAMMU:చిన్నారి కలను నెరవేర్చిన మోదీ..!

కొవిడ్ సమయంలో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనలో భాగంగా అర్హులైన వారికి దాదాపు 14కోట్ల మందికి ఉచితంగా ఎల్పీజీ రీఫిల్స్‌ను కేంద్రం అందించింది. అయితే ఒకప్పుడు 14.2కేజీ గ్యాస్ సిలిండర్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు వినియోగదారుల అవసరాలను దృష్ట్యా 5కేజీల సిలిండర్లను కూడా ప్రభుత్వం అందిస్తుంది.

Also Read: Rahul Gandhi:షాకిచ్చిన న్యాయస్థానం

- Advertisement -