డెజర్ట్ వైపర్స్ తమ చరిత్రలో తొలి డీపీ వరల్డ్ ILT20 ట్రోఫీని సొంతం చేసుకుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో, MI ఎమిరేట్స్‌పై 46 పరుగుల తేడాతో విజయం సాధించింది. విజేతలుగా వైపర్స్‌కు USD 7 లక్షల నగదు బహుమతితో పాటు బ్లాక్ బెల్ట్ లభించగా, రన్నరప్ MI ఎమిరేట్స్‌కు USD 3 లక్షలు అందాయి.
వైపర్స్ కెప్టెన్ సామ్ కరన్ అజేయంగా 74 పరుగులు (51 బంతుల్లో) చేసి జట్టును అజేయమైన 182/4 స్కోరుకు నడిపించాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. మ్యాక్స్ హోల్డెన్ 41 (32), డాన్ లారెన్స్ 23 (15) కీలక సహకారం అందించారు. బౌలింగ్‌లో నసీమ్ షా 3/18, ఉస్మాన్ తారిక్ 2/20, ఖుజైమా తన్‌వీర్ 2/22 చక్కని ప్రదర్శన కనబరిచగా, డేవిడ్ పెయిన్ 3/42తో MI ఎమిరేట్స్‌ను 136 పరుగులకు పరిమితం చేశాడు.
ఈ టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శనతో సామ్ కరన్ రెడ్ బెల్ట్ (మోస్ట్ వాల్యూవబుల్ ప్లేయర్), గ్రీన్ బెల్ట్ (బెస్ట్ బ్యాటర్) రెండింటినీ గెలుచుకున్నాడు. సీజన్‌లో అతను 397 పరుగులు, మూడు అర్ధశతకాలు, అలాగే 7 వికెట్లు, 10 క్యాచ్‌లతో ఆల్‌రౌండ్ ప్రతిభ చూపించాడు.
వైట్ బెల్ట్ (బెస్ట్ బౌలర్)ను దుబాయ్ క్యాపిటల్స్ ఆటగాడు వాకర్ సలామ్‌ఖెయిల్ 18 వికెట్లతో గెలుచుకున్నాడు. బ్లూ బెల్ట్ (బెస్ట్ యూఏఈ ప్లేయర్)ను MI ఎమిరేట్స్ మహ్మద్ వసీం వరుసగా నాలుగో సీజన్‌లోనూ దక్కించుకున్నాడు (సీజన్ 4లో 370 పరుగులు). ప్రతి బెల్ట్ విజేతకు USD 15,000 బహుమతి అందించారు.
Also Read:మోడీ అంటే ఇష్టం అంటూనే..భారత్‌కు ట్రంప్ హెచ్చరిక!

