ఎడారిలో వరదల బీభత్సం ఎక్కడో తెలుసా…..

100
desert
- Advertisement -

ఎడారి దేశంలో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. యునైటెడ్‌ అరబ్‌ఎమిరెట్స్‌ లోని రాతి ఎడారి ప్రాంతంగా పేరొందిన పుజైరాతో పాటు షార్జాలో కురిసిన భారీ వర్షం ఆకస్మిక వరదలకు కారణమయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు దుకాణాలు, వాహనాలు నీటమునిగాయి. దీంతో రంగంలోకి దిగిన విపత్తు నిర్వహణ బృందాలు సైన్యం సహాయ కార్యక్రమాలను చేపట్టాయి. వరదల్లో చిక్కుకుపోయిన వందల మందిని రక్షించి, 4వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించాయి. గత రెండు రోజులుగా పుజైరాలో కురిసిన వర్షపాతం 27 ఏళ్లలోనే అధికమని అక్కడి జాతీయ వాతావరణ కేంద్రం ప్రకటించింది. భారీ వర్షాల దాటికి పర్వత ప్రాంతాలకు దిగువన ఉన్న గ్రామాలు మొత్తం నీటితో మునిగిపోయాయి. మరోవైపు దుబాయ్‌, అబుదాబీ నగరాల్లో మాత్రం తేలికపాటి వర్షమే కురిసినట్టు సమాచారం. యుఏఈలో నీరులేని పర్వత ప్రాంతాలు, రాతినేలలు, మైదాన ప్రాంతాల మిశ్రమం… ఇలాంటి ఎడారి దేశంలో అరుదుగా చోటు చేసుకున్న వరదలకు సంబందించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

- Advertisement -