ప్రస్తుత ఆధునిక కాలంలో రాజరిక పాలన ఉందంటే నమ్ముతారా అవును నిజమే…బ్రిటన్ రాజరిక పాలనలో ఉన్న ప్రజాస్వామ్య దేశం. 96సంవత్సరాల వయస్సులో సెప్టెంబర్ 8న బ్రిటన్ రాణి ఎలిజబెత్ -2 మరణించిన సంగతి అందరికి తెలిసిందే. ఇప్పుడు అందరి మదిలో మరోక ఆలోచన వచ్చింది. అత్యధిక కాలం బ్రిటన్ రాణిగా సూమారుగా 7దశాబ్దాలకు పైగా ఉన్నారు. యూరోప్‌లోనే అత్యధిక కాలం రాణిగా ఉన్న రెండవ వ్యక్తిగా బ్రిటన్ రాణి చరిత్రలో నిలిచారు. అ తర్వాత అత్యధిక కాలం పాటు రాణిగా ఉన్న మూడవ వ్యక్తి ఎవరో తెలుసా…అమె డెన్మార్క్ క్వీన్ మార్గరెట్-2.
యురోప్‌లో అత్యధిక దేశాలకు రాజరిక పాలన ఉన్న, ప్రజాస్వామ్య ప్రభుత్వాలనే నడిపిస్తున్నారు. ప్రస్తుత డెన్మార్క్ రాణి మార్గరెట్ -2, 1940 కోపెన్‌హాగన్‌లో జన్మించారు. మార్గరెట్ పుట్టేనాటికి డెన్మార్క్ దేశంలో మహిళలకు రాచరికం మరియు కిరీటంపై హక్కులేదు. ఫ్రెడరిక్‌కు మగ సంతానం లేనందువల్ల మార్గరెట్ కోసం 1953లో చట్టాన్ని మార్చి ఆమెను అర్హురాలిగా చేశారు.
1972లో ఆమె తండ్రి ఫ్రెడరిక్-9 మరణం తర్వాత 31ఏళ్ల వయస్సులో మార్గరెట్-2 డెన్మార్క్‌కు రాణి అయ్యారు. ఆమె సింహాసనాన్ని అధిరోహించిన సమయంలో డెన్మార్క్ ప్రజలు, ఇతర రాజకుటింబీకులూ, మత పెద్దలు చాలా మంది ఈ నిర్ణయాన్ని ఇష్టపడలేదు. అయితే, సమయం గడిచే కొద్దీ డెన్మార్క్ ప్రజల ఆలోచన దోరణిలో మార్పు జరిగినందువల్లే కావచ్చు…ఆమే అంటే నేడు దేశ ప్రజలకు ఏనలేని ప్రేమ. బహుశా డెన్మార్క్ ఆధునికీకరణ మరియు అభివృద్ధిలో మార్గరెట్ కీలక పాత్ర వహించినందున్న వల్లే కావచ్చు డానిష్ ప్రజలు ఇప్పుడు ఆమెకు అనుకూలంగా ఉన్నారు.
మార్గరెట్-2 2022 జనవరి నాటికి చక్రవర్తిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవాల్సి ఉండే కానీ కరోనా వల్ల వేడుకలను వాయిదా వేస్తూ వచ్చారు. చివరికి ఇదే నెలలో వేడుకలు జరగాల్సి ఉండగా…బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 మరణంతో మరో సారి వేడుకలను వాయిదా వేసే అవకాశం ఉందని డెన్మార్క్‌లోని స్థానిక మీడియా సంస్థల కథనం. మార్గరెట్-2 బ్రిటన్ రాణి ఎలిజబెత్-2కు వరుసకు బంధువు.