అమెరికా అధ్యక్ష ఎన్నికలు హోరాహోరిగా సాగుతున్నాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి,ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్-డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి జోసెఫ్ బైడెన్ మధ్య హోరాహోరి పోరు సాగుతోంది.
డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా జోసెఫ్ బైడెన్‌ను అధికారికంగా ప్రకటించగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, జిమ్మీ కార్టర్‌లు.. బైడెన్‌ను అధ్యక్ష అభ్యర్థిగా ప్రతిపాదించారు. మాజీ విదేశాంగ మంత్రి కొలిన్ పావెల్ కూడా తన మద్దతు తెలిపారు. పార్టీ తన నామినేషన్‌ను అంగీకరించడం జీవితానికి గౌరవంగా భావిస్తానని బైడెన్ తెలిపారు.
బైడెన్‌ను అధ్యక్ష అభ్యర్థిగా నామినేట్ చేస్తూ 50 రాష్ట్రాలు అనుకూలంగా ఓటేశాయి. కరోనా నేపథ్యంలో పార్టీ సమావేశాలు వర్చువల్ పద్ధతిలో సమావేశాలు జరుగుతుండగా నాలుగోరోజు ప్రసంగించనున్నారు బైడెన్. అధ్యక్ష రేసులో బైడెన్ నిలబడడం ఇది మూడవసారి కాగా ఈ ఏడాది నవంబర్ 3వ తేదీన అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.