డెమొక్రాట్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమలా నామినేట్‌

195
kamala harris

అమెరికా అధ్యక్ష,ఉపాధ్యక్ష రేసులో డెమొక్రాట్ పార్టీ దూసుకుపోతోంది. ఇప్పటికే డెమొక్రాట్ అధ్యక్ష అభ్యర్ధిగా బైడెన్‌ని నామినేట్ చేసిన ఆ పార్టీ తాజాగా భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌ను అమెరికా ఉపాధ్యక్ష పదవికి నామినేట్‌ చేసింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరుగుతున్న పార్టీ జాతీయ సదస్సులో బుధవారం ఆమె అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించింది.

డొనాల్డ్‌ ట్రంప్‌ నాయకత్వ వైఫల్యాల కారణంగా అమెరికా ప్రజలు తమ జీవితాల్నే పణంగా పెట్టారని మండిపడ్డారు కమలా హ్యారిస్. తాను భారత్, జమైకా వలసదారుల బిడ్డనని …నల్లజాతి మూలాలు, భారతీయ వారసత్వం కలిగినందుకు గర్వపడేలా అమ్మ పెంచారని తెలిపారు.

ఇతరులకు సేవ చేస్తే మన జీవితానికి పరమార్థం వచ్చినట్టవుతుంది. ఇప్పుడు నాకు ఆ సేవ చేసే అవకాశం దక్కబోతోంది. అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా మీరు చేసిన నామినేషన్‌ను నేను ఆమోదిస్తున్నానను అని తెలిపారు.