కన్న తల్లి రాక్షసిగా మారింది… అల్లరు ముందుగా చూసుకోవాల్సిన తన కొడుకును చితక బాదింది. గొడ్డును కొట్టినట్లు దారుణంగా కొట్టింది. మనిషిలా ప్రవర్తించాల్సింది పోయి ఒక వీధి రౌడీల తన కొడుకు పట్ల ప్రవర్తించింది. మానవత్వం మంట కలసిపోయ్యేల చేసింది.
ఢిల్లిలోని చంటి పిల్లడిపై ఓ తల్లి విరుచుకపడింది,…ఏడాదిన్నర వయసున్న కొడుకును చితకబాదిన దృష్ట్యాలు మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ చంటి పిల్లాడిని కింద పారేసి చేతితో ఎడాపెడా బాదేయడమే కాక, చివరకు కాళ్లతో కూడా తన్నుతున్న దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి. తర్వాత కాసేపటికి ఒక మహిళ వచ్చి ఆ పిల్లాడిని తీసుకుపోవడం కూడా రికార్డయింది.
మూడేళ్ల క్రితం తన కొడుకుతో ఆమెకు పెళ్లయిందని, వాళ్లిద్దరికీ ముగ్గురు పిల్లలున్నారని.. కానీ ఆమె మాత్రం తరచు భర్తతో పాటు ముగ్గురు పిల్లలను కూడా కొడుతూ ఉంటోందని సదరు మహిళ అత్తగారు షహానా ఢిల్లీ మహిళా కమిషన్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది చాలా షాకింగ్ ఘటన అని ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె తరచు కొడుతున్న ఆ విషయం నిరూపించడానికి తమ వద్ద సాక్ష్యాలు ఏమీ లేవని, చివరకు ఇంట్లో సీసీటీవీ కెమెరాలు అమర్చిన తర్వాత ఆమె విషయం బయటపడిందని ఆమె అత్తగారు షహానా తెలిపారు.
గీతా కాలనీకి చెందిన సదరు మహిళ ప్రస్తుతం పరారీలో ఉంది. ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ దాఖలు చేశామని, తూర్పు ఢిల్లీ డీసీపీ ఓంవీర్ సింగ్ చెప్పారు. తన కోడలు తరచు భర్తను, పిల్లలను కొడుతూ ఉంటుందని, తాము ఎంత చెప్పినా వినిపించుకోలేదని షహానా అన్నారు.
పశువులను కూడా ఇంత దారుణంగా కొట్టరని, అలాంటిది తన కన్న కొడుకును…అది పాపం ఏడాదిన్నర వయస్సు గల కొడుకును కొట్టిందంటే ఆమె మానసిక స్థితి మీద విచారణ చేయాల్సి ఉందని మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ అన్నారు. ఒకవేళ ఆమెకు మానసిక పరమైన సమస్య ఏదైన ఉంటే తప్పకుండా చికిత్స చేయిస్తామన్నారు స్వాతి అన్నారు.
ఇటీవలే కాలంలో చిన్న పిల్లలపై అఘ్యాత్యాలు పెరుగిపోతున్నాయి. మొన్నటీకి మొన్న ఓ బేబి కేర్ సెంటర్‌లో ఆయా ఓ చంటిపిల్లడ్ని గొడ్డును కొట్టినట్లు కొట్టింది. ఇప్పుడు కన్న తల్లి తన కొడుకుపై దారుణానికి పాల్పడింది. రాను రాను సమాజంలో చిన్న పిల్లలకు రక్షణ లేకుండా పోతుందని ఈ వీడియోను చూసిన నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. చెల్డ్ హేల్ప్‌లైన్ అధికారులు పిల్లలకు మరింత రక్షణ కల్పించాల్సిందిగా పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
https://youtu.be/znu87-sqP1c?t=200