తన అద్భుతమైన బౌలింగ్‌తో భారత్‌కు చిరస్మరణీయ విజయాలను అందించాడు టీమిండియా పేసర్ షమి. ప్రస్తుతం షమికి కష్టకాలం నడుస్తోంది. షమి భార్య హసీన్ జహాన్ అతనిపై గృహహింస కేసు నమోదుచేసిన సంగతి తెలిసిందే.షమికి ఓ ఫిక్సర్ అని ఇతర మహిళలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు చేసింది. అయితే ఈ వార్తలను షమి కండించాడు. తాను చావనైన చస్తాను కానీ అలాంటి పని ఎప్పుడు చేయబోనని తెలిపాడు.
భార్య హసీన్ ఆరోపణలతో తీవ్ర ఇబ్బందుల్లో పడ్డాడు షమి. బీసీసీఐ కాంట్రాక్టుల్లో స్థానం కోల్పోగా… తాజాగా ఐపీఎల్ నుంచి కూడా దూరమయ్యే పరిస్ధితి వచ్చింది. ప్రస్తుతం ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న షమి..భవితవ్యం కొద్దిరోజుల్లో తేలనుంది. షమిది సున్నితమైన అంశమని… ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేమని చెప్పారు. షమి వ్యవహరంలో బీసీసీఐ అభిప్రాయం తీసుకుంటామన్నారు ఢిల్లీ జట్టు ప్రతినిధి.
ఇప్పటికే షమితో పాటు మరో నలుగురిపై హత్యాయత్నం, గృహ హింసతో పాటు పలు సెక్షన్ల కింద జాధవ్‌పూర్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. అభియోగాలన్నీ రుజువైతే షమికి కనీసం పదేళ్ల జైలు శిక్ష పడొచ్చు. షమిని హసీన్ రెండో పెళ్లి చేసుకోగా అంతకుముందే ఆమెకు ఇద్దరు కూతుళ్లున్నారు.