- Advertisement -
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నియంత్రించే ఏర్పాట్ల పురోగతిపై సమీక్ష నిర్వహించారు కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ. పంజాబ్, హర్యానాలో పంట కాల్చడం వంటి చర్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని సమావేశంలో చర్చించారు. ఈ అంశంపై మరింత ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అధికారులు అభిప్రాయ పడ్డారు.
రెండు రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో పంట దహనాన్ని నియంత్రించే బృందాలను ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. పంటలు దహనం చేసే వారిపై జరిమానాలు విధించాలని ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్తులో ఏవైనా అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవటానికి పంజాబ్,హర్యానా రాష్ట్రాలు సిద్ధంగా ఉండాలని అధికారులకు కేబినెట్ సెక్రటరీ వివరించారు.
- Advertisement -