- Advertisement -
ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లలో 654 కేసులు నమోదుచేశామని తెలిపారు ఢిల్లీ పోలీసులు. ఇప్పటివరకు 1820 మందిని అదుపులోకి తీసుకున్నామని ఆయుధాల చట్టానికి సంబంధించి 47 కేసులు నమోదయ్యాయని చెప్పారు.
ఈ అల్లర్లలో ఇంటలిజెన్స్ బ్యూరో సెక్యూరిటీ అసిస్టెంట్ అంకిత్ శర్మను దుండగులు హత్య చేసిన విషయం తెలిసిందే. ఐబీ ఉద్యోగిని లక్ష్యంగా చేసుకుని అల్లరి మూకలు దాడులకు తెగబడేలా స్థానిక మాజీ ఆప్ నేత తాహిర్ హుస్సేన్ రెచ్చగొట్టారని ఆరోపణలు వచ్చాయి. దీంతో తాహిర్‌ని ఆప్ సస్పెండ్ చేయగా ఇవాళ అరెస్ట్ చేశారు పోలీసులు. దయాల్‌పూర్, ఖజూరీఖాస్ పోలీస్ స్టేషన్లలోనూ హింసాకాండకు సంబంధించి హుస్సేన్‌పై రెండు ఎఫ్‌ఐఆర్‌లు దాఖలయ్యాయి.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గత వారం జరిగిన అల్లర్లలో 42 మంది మృతి చెందగా..200 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే.
- Advertisement -