ఢిల్లీ లిక్కర్ కేసు..బోగస్!

30
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కామ్” పేరిట బీజేపీ రాజకీయ క్షుద్ర క్రీడ ఆడుతోంది. బీజేపీ కడిగిన ముత్యమూ, సుద్ద పూస, ఇతర పార్టీలేమో అవినీతి బురదలో పొర్లాడుతున్నాయని కాషాయ పెద్దలు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అవహేళన చేస్తున్నాయి.

2022లో నవంబర్ 11 నాడు అరబిందో ఫార్మా ప్రమోటర్, డైరెక్టర్ శరత్ చంద్రా రెడ్డిని ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ చేసింది ఈడీ. శరత్ చంద్రా రెడ్డి అరెస్ట్ అయిన నాలుగు రోజులకు సదరు అరబిందో ఫార్మా బీజేపీ పార్టీకి రు. 5 కోట్లు విరాళంగా ఇచ్చింది. ఇంత పెద్ద కేసులో నిందితుడి నుండి ఏ శషబిషలు లేకుండా బీజేపీ ఆ రూ.5 కోట్ల విరాళం గుటుక్కున మింగింది.

మే 2023లో శరత్ చంద్రా రెడ్డి బెయిల్ పిటీషన్ కోర్టులో విచారణకు వస్తే చాలా విచిత్రంగా ఈడీ ఆ పిటీషన్‌ను వ్యతిరేకించలేదు. ఇలాంటి కేసుల్లో ఈడీ ఎన్నడూ బెయిల్ పిటీషన్ వ్యతిరేకించకుండా ఉండదు. జైల్ నుండి విడుదల అయిన శరత్ చంద్రా రెడ్డి జూన్ 2 నాడు ఇదే కేసులో అప్రూవర్‌గా మారుతాను అని ప్రకటించాడు.

నవంబర్ 8, 2023 నాడు ఇదే అరబిందో ఫార్మా మరో భూరి విరాళం – రు. 25 కోట్ల రూపాయలు బీజేపీకి సమర్పించుకుంది. ఇదే తేదీన ఏపీఎల్ హెల్త్ కేర్ నుంచి రూ. 10 కోట్లు, యుజియ ఫార్మా నుండి ఇంకో రూ. 15 కోట్లు మొహమాటం లేకుండా బీజేపీ కళ్లుమూసుకుని రూ. 50 కోట్లు తీసుకుంది. మొత్తం రూ. 55 కోట్లు స్వాహా చేసింది.

కథ ఇక్కడితో అయిపోలేదు.. రెండేళ్లుగా మీడియాలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ పేరిట ఆమ్ ఆద్మీ పార్టీ, వైయస్ఆర్‌సీపీ, అకాలీదళ్, బీఆర్ఎస్ తదితర పార్టీ నాయకుల మీద ఇష్టారీతిన కేంద్ర ఏజెన్సీలతో దాడులు చేయిస్తూ, మీడియాకు ఆరోపణలు, లీకులు ఇస్తున్నది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం. ఇతర పార్టీ నాయకులను అరెస్టుల పేరిట వేధిస్తూ, అదే కేసులో నిందితుడిగా పేర్కొన్న మాగుంట రాఘవరెడ్డిని ఎన్డీయే పార్లమెంటు అభ్యర్ధిగా నిలబెట్టి ప్రధాని మోడీనే ఆయనకు ప్రచారం చేసి ఓటు వేయమని కోరబోతున్నారు. ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏం కావాలి? ఈ ఢిల్లీ లిక్కర్ కేసు అనేది ఉట్టి బోగస్ అని ప్రతిపక్ష పార్టీలను, నాయకులను వేధించేందుకు బీజేపీ సర్కార్ చేసిన మాయోపాయమని!

Also Read:Sukumar:సుక్కు నెక్ట్స్ ఎవరితో?

- Advertisement -