దేశ రాజధానిలో ఓ వ్యాపారుడు కరంటును దొంగిలించాడు. దానికి శిక్షగా చరిత్రలో ఇప్పటివరకు ఏ కోర్టు ఇవ్వని తీర్పు ఢిల్లీ హైకోర్టు ఇచ్చింది.. కరెంటు గొంగతనం ఏంటి అని షాక్ అవుతున్నార..! మీరు విన్నది నిజమే.. అసలు విషయం ఏంటంటే.. ఓ వ్యాపారవేత్త తన షాపుకు కరెంటు కోసం విద్యుత్ స్తంభం నుంచి నేరుగా వైర్లు లాగి విద్యుత్ చౌర్యానికి పాల్పడినట్టు అధికారులు గుర్తించారు. అతడిపై విద్యుత్ శాఖ వర్గాలు జిల్లా కోర్టులో ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది.
కేసు ఎలా నమోదు చేస్తారంటూ ఆ షాపు యజమాని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. విద్యుత్ చౌర్యానికి పాల్పడింది తాను కాదని, తన దుకాణాన్ని మరో వ్యక్తికి అద్దెకు ఇస్తే అతడు విద్యుత్ చౌర్యానికి పాల్పడ్డాడని వివరించాడు. అయితే, న్యాయమూర్తి అతడి వాదనలను పక్కనబెట్టి, నీపై క్రిమినల్ విచారణ నిలిపివేయాలంటే 30 రోజుల్లో 50 మొక్కలు నాటాలంటూ కొత్త తరహాలో శిక్ష విధించారు. ఈ క్రమంలో అతడికి దిశానిర్దేశం కూడా చేశారు.
గులార్, కదంబ, పిల్ఖాన్, జామూన్, మర్రి, మామిడి, అమల్టాస్, మహువా, పుత్రంజివా, బాధ్, సంగ్వాన్, సఫెద్ సిరిస్, కాలా సిరిస్, అంజీర్, కథల్, జాక్‌ఫ్రూట్, పలాష్ అర్నీ, బిస్తెందు, రొహిందా, మెడ్షింగీ జాతి మొక్కల్ని నాటాలని హైకోర్టు ఆదేశించింది. మొక్కల్లో ఒక్కటి తగ్గినా తిరిగి చోరీ కేసు విచారణ మొదలవుతుందని స్పష్టం చేసింది. మొక్కలు నాటాక వాటిని ఫొటోలు తీసి, పూర్తి వివరాలతో రిపోర్ట్ ఇవ్వాలని డిప్యూటీ కన్సర్వేటర్‌ను కోర్టు కోరింది. ఆరు నెలలపాటూ మొక్కల్ని పెంచాలనీ, ఆ తర్వాత వాటిని ఫొటోలు తీసి మరో రిపోర్ట్ ఇవ్వాలని క్లారిటీగా చెప్పింది.
ఢిల్లీ మహానగరంలోని వందేమాతరం మార్గ్, సెంట్రల్ రిడ్జ్ రిజర్వ్ ఫారెస్ట్, బుద్ధ జయంతి ఉద్యానవనం వద్ద మొక్కలు నాటాలని తెలిపారు. అంతేకాదు, ఆ మొక్కలు 6 అడుగుల ఎత్తు ఉండాలని, వాటి వయసు 2 నుంచి 3 ఏళ్లు ఉండాలని, ఢిల్లీ నేలకు, వాతావరణానికి అనుకూలంగా ఉండే మొక్కలనే ఎంచుకోవాలని షరతులు విధించారు.