ముగిసిన ఢిల్లీ ఎన్నికల ప్రచార పర్వం..

299
Delhi Election 2020
- Advertisement -

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నేపథ్యంలో గత కొద్ది రోజులుగా ప్రధాన పార్టీలైన ఆమ్‌ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారాలు, రోడ్‌షోలు, బహిరంగసభల్లో పాల్గొన్నారు. ఈ రోజుతో ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనుండగా.. ఫిబ్రవరి 11న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 668 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో అత్యధికంగా న్యూ ఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 28 మంది అభ్యర్థులు, అత్యల్పంగా పటేల్ నగర్ అసెంబ్లీ నుంచి నలుగురు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎన్నికల్లో ఒక కోటి 46లక్షల 92వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఢిల్లీ ఎన్నికల కోసం మొత్తం 13,750 పోలింగ్ కేంద్రాలలో ఏర్పాటు చేశారు. ఒకే దశలో ఎన్నికల నిర్వహణ చేస్తున్నారు.13000 వేల మంది ఎన్నికల సిబ్బందితో 90వేల మంది భద్రత సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. ఇందు కోసం ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది.

- Advertisement -