నేటితో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగియనుంది. సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుండగా ఈ నెల 8న ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 70 స్ధానాలకు ఎన్నికలు జరుగుతుండగా ఈ నెల 11న ఫలితాలు వెల్లడికానున్నాయి.
ఇవాళ సాయంత్రం 5 గంటల తర్వాత ప్రచారం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ స్పష్టం చేసింది. గత మూడు వారాలుగా ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ప్రధానంగా పోరు కేజ్రీవాల్ సారధ్యంలోని ఆప్,బీజేపీ మధ్య నెలకొంది.
ఎన్నికల ప్రచారంలో ఇరు పార్టీలకు చెందిన నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ముఖ్యంగా సీఏఏ, ఎన్‌ఆర్‌సీ నేపథ్యంలో జేఎన్‌యూ, షాహిన్‌బాగ్‌లలో నిరసనకారులు ఆందోళనలు నిర్వహిస్తుండడంతో ఎన్నికలు రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. అయితే కొన్నిచోట్ల కాంగ్రెస్ పార్టీ కూడా పోటీ ఇచ్చే అవకాశం ఉండటంతో ఢిల్లీ ఓటర్లు ఎలాంటి తీర్పు చెబుతారోనన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.