ఢిల్లీ విందులో చీర్ గ‌ర్ల్స్… బీసీసీఐ చివాట్లు..

249
Delhi Daredevils Total team celebrate the Dinner Party
- Advertisement -

ఐపీఎల్‎లో ఆట‌గాళ్లను, అభిమానుల‌ను ఉత్సాహ‌ప‌రుస్తుంటారు చీర్ గర్ల్స్. ప్ర‌తి ఒక్క జ‌ట్టుకు చీర్ గ‌ర్ల్స్ ఉంటారు. ఆట‌గాళ్లు ఫోర్లు, సిక్సుల‌తో అద‌ర‌గొడుతున్న‌ప్పుడు.. వీళ్ల డ్యాన్స్ తో ఆ మ్యాచ్‎కి మ‌రింత ఉత్సాహాన్ని తీసుకువ‌స్తారు. తాజాగా చీర్ గ‌ర్ల్స్ విష‌యంలో ఢిల్లీ యాజ‌మాన్యం చేసిన పనికి… బీసీసీఐ చివాట్లు పెట్టింది.

Delhi Daredevils Total team celebrate the Dinner Party

ఈ సీజ‌న్‎లో ఐపీఎల్ లీగ్ ద‌శ నుంచి ఢిల్లీ డేర్ డెలివ‌ల్స్ నిష్ర్క‌మించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆ జ‌ట్టు నిర్వాహ‌కులు, మేనేజ్‎మెంట్, ఆట‌గాళ్లంద‌రూ విందు కార్య‌క్ర‌మం ఏర్పాటు చేసుకున్నారు. ఈ విందు కార్య‌క్ర‌మానికి చీర్ గ‌ర్ల్స్‎ని కూడా ఆహ్వానింనించారు. చీర్ గ‌ర్ల్స్ ఈ విందులో పాల్గొన్న విష‌యం తెలుసున్న బీసీసీఐ అవినీతి నిరోధ‌క శాఖ ఢిల్లీ ప్రాంఛైజీ అధికారుల‌కు చివాట్లు పెట్టింది. ఇలా చేయ‌డం నిబంధ‌న‌లను ఉల్ల‌ఘించిన‌ట్లే అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది

ఐపీఎల్‎లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు వెలువ‌డిన‌ప్ప‌టి నుంచి ఆట‌గాళ్ల‌ను బ‌య‌టి వ్య‌క్తులు క‌ల‌వ‌కూడ‌ద‌న్న నిబంధ‌న‌లు తీసుకువ‌చ్చింది బీసీసీఐ. ఆట‌గాళ్లు పాల్గొనే ఏ ప్రైవేట్ కార్యక్రమంలో బ‌య‌టి వ్య‌క్తులు ఎవ‌రూ పాల్గొన‌కూడ‌దు.

మ‌రోవైపు ఈ సంఘ‌ట‌న‌పై ఢిల్లీ యాజ‌మాన్యం స్పందించింది. ఆట‌గాళ్లు చీర్ గ‌ర్ల్స్‎కి ఇచ్చిన విందు కాదు ఇది. వాళ్లు వ‌చ్చారు తిన్నారు వెళ్లిపోయారు. ఈ విష‌యంపై బీసీసీఐ అవినీతి నిరోధ‌క శాఖ అధికారులు ఆగ్ర‌హం ఉన్నార‌ని తెలిసింది. వారితో మేం మాట్లాడ‌తాం అంటూ ఢిల్లీ యాజ‌మాన్యం తెలిపింది.

- Advertisement -