- Advertisement -
ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో ఒక్క కొరోన పాజిటివ్ కేసు నమోదు కాలేదు అని తెలిపారు సీఎం కేజ్రీవాల్. కరోనా పాజిటివ్ వచ్చిన ఐదుగురు రోగులను ఆసుపత్రి నుంచి విడుదల చేసినట్లు వెల్లడించారు. కరోనాను నివారించడమే అతిపెద్ద సవాలు అన్నారు. దీనిని సాధించడంలో అందరి సహకారం అవసరమని చెప్పారు సీఎం కేజ్రీవాల్.
కాగా దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుంది. ఇప్పటివరకు 492మందికి ఈ వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 7గురు మరణించారు. దేశ వ్యాప్తంగా 19రాష్ట్రాల్లో లాక్ డౌన్ ప్రకటించారు. ఈనెల 31వరకు లాక్ డౌన్ అమల్లో ఉండనున్నట్లు కేంద్రం ప్రకటించింది.
- Advertisement -