మంత్రి కేటీఆర్ కు ధ్యాంక్స్ చెప్పిన ఢిల్లీ సీఎం

445
Kejriwal ktr
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 70 సీట్లను గాను 62 స్ధానాల్లో ఆమ్ ఆద్మీ విజయం సాధించగా..8 స్ధానాల్లో బీజేపీ గెలుపొందింది. ఇక కాంగ్రెస్ పార్టీ ఖాతా కూడా తెరవలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కు దేశ వ్యాప్తంగా పలువురు నాయకులు అభినందనలు తెలుపుతున్నారు.

ఈసందర్భంగా తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్టర్ ద్వారా కేజ్రీవాల్ కు శుభాకాంక్షాలు తెలిపారు. వరుసగా మూడో సారి విజయం సాధించినందుకు కేజ్రీవాల్ కు అభినందనలు తెలిపారు కేటీఆర్. ఈసందర్భంగా మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ కు రీ ట్వీట్ చేశారు కేజ్రీవాల్. మంత్రి కేటీఆర్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ktr tweet

- Advertisement -