ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్

4
- Advertisement -

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ లభించింది. ఎక్సైజ్‌ పాలసీ కేసులో సీబీఐ కేసులో సుప్రీం కోర్టు  బెయిల్ మంజురు చేసింది. సీబీఐ అరెస్టును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపి బెయిల్ ఇచ్చింది. దీంతో ఇవాళ ఆయన జైలు నుండి బయటకు రానున్నారు.

జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం సెప్టెంబర్ 5న తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. విచారణలో సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కేజ్రీవాల్ తరఫు వాదనలు వినిపించారు.  ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో కేజ్రీవాల్ పేరు లేదు. కేజ్రీవాల్‌ను బెయిల్‌పై విడుదల చేయాలని రెండుసార్లు సుప్రీంకోర్టు, ఒకసారి ట్రయల్ కోర్టు ఆదేశించాయని తెలిపారు.

Also Read:టీజీబీపాస్‌ దరఖాస్తుల పరిష్కారం వేగవంతం..

- Advertisement -