- Advertisement -
రాజస్థాన్‌పై గెలుపొంది ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది ఢిల్లీ. రాజస్ధాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 18.1 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కొల్పోయి లక్ష్యాన్ని చేధించింది. మిచెల్ మార్ష్ విధ్వంసకర బ్యాటింగ్‌తో రాజస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. మార్ష్ 62 బంతుల్లో 7 సిక్స్‌లు, 5 ఫోర్లతో 89 పరుగులు చేయగా వార్నర్ 41 బంతుల్లో 52 పరుగులతో రాణించాడు.
ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. జైస్వాల్ 19,అశ్విన్ 50,పడిక్కల్ 48 పరుగులతో రాణించారు. చేతన్ సకారియా,నూర్జ్,మార్ష్ తలో రెండు వికెట్లు తీశారు.
- Advertisement -